Header Banner

ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!

  Fri May 23, 2025 07:06        Politics

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వైకాపా ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన 1/2019 సర్క్యులర్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం స్పందించింది. దీనికి కట్టుబడి ఉండాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ప్రయాణికుల భద్రత కోసం కొత్త బస్సుల్లో ఫైర్ అలారం, సిలిండర్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 48వేల మంది ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీఎస్ఆర్టీసీలో నిలిపివేసిన 1/2019 సర్క్యూలర్‌ను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 1/2019 సర్క్యూలర్‌ అమలు చేయాలంటూ ఎన్‌ఎంయూ నేతృత్వంలోని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇటీవల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్‌ఎంయూ నేతలతో చర్చలు జరపాలని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

 

ఇది కూడా చదవండి: అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!

 

ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఉద్యోగులపై చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఎన్ఎంయూ ఉద్యోగ సంఘం నేతలు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్ఎంయూ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం.. 1/2019 సర్క్యూలర్‌కు కట్టుబడి ఉండాలని.. ఆ సర్క్యులర్‌కు లోబడి ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ముందు 1/2019 సర్కులర్‌లోని అంశాలు పాటించాలని.. ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలపై ఎన్‌ఎంయూ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలిపారు.

 

ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల్లో గేట్ మీటింగ్‌లు నిర్వహించనున్నట్లు ఎన్ఎంయూ నేతలు తెలిపారు. ఈ గేట్ మీటింగుల్లో 1/2019 సర్క్యులర్, ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాలపై సిబ్బందికి అవగాహన కల్పించాలని ఎన్‌ఎంయూ నేతలు నిర్ణయించారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పించేలా ఇచ్చిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రయాణికుల భద్రత , సౌకర్యం కోసం ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్టీసీ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని కొత్త బస్సుల్లోనూ సెన్సార్‌తో నడిచే ఫైర్‌ అలారం ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగితే నియంత్రించేందుకు బస్సుల్లో సిలిండర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APSRTC #APSRTCEmployees #EmployeeWelfare #119Circular #ChandrababuNaidu #NMU